రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో మొద‌లైన రాజ‌కీయాలు

రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌గా మారింది. విప‌క్షాల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఇప్పుడు బీజేపీ ఏక‌గ్రీవం కోసం త‌మ‌దైన శైలిలో మంత‌నాలు జ‌రుపుతోంది.

రాజ్య‌స‌భ‌లో మొత్తం 245 మంది సభ్యులు ఉండ‌గా.. ఇందులో బీజేపీకి సొంత బ‌లం 114 మంది. మిత్ర ప‌క్షాల మ‌ద్దతు కూడా తీసుకొని త‌మ అభ్య‌ర్థిని ఏకగ్రీవం చేసుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బీజేపీ ఇదివ‌ర‌కే త‌మ పార్టీ ఎంపీల‌కు విప్ జారీచేసింది. ఎన్‌.డి.ఏ  అభ్య‌ర్థిగా హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ ఇదివ‌ర‌కే నామినేష‌న్ వేయ‌గా.. విప‌క్షాల త‌రుపున కూడా ఉమ్మడి అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌నున్నారు. కాంగ్రెస్ ఇప్ప‌టికే ప్ర‌క్రియ పూర్తిచేసిన‌ట్లు చెబుతోంది.

ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌కు ఫోన్ చేశారు. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తివ్వాల‌ని కోరారు. త‌మ పార్టీ నేత‌లతో క‌లిసి చ‌ర్చించి తుది నిర్ణ‌య ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. కాగా నితీష్‌ ఏపీ సీఎ జ‌గ‌న్‌కు కూడా కాల్ చేసినట్లు తెలుస్తోంది. రాజ్య‌స‌భ‌లో వైసీపీకి ఆరుగురు స‌భ్యులుండ‌గా.. అంద‌రూ ఎన్‌.డి.ఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న జ‌గ‌న్‌తో మాట్లాడిన‌ట్లు స‌మాచారం. పార్ల‌మెంటు తొలి స‌మావేశాలైన ఈనెల 14వ తేదీన రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here