యువతి శవాన్ని కుక్కలు పీక్కుతిని.. దొరకని ఆనవాళ్లు.. తాడేపల్లిగూడెంలో ఘోరం

జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోరం వెలుగుచూసింది. అనంతపల్లి ఎర్రకాల్వలో దారుణమైన స్థితిలో కనిపించిన గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపింది. కాల్వ ఇంకిపోవడంతో శవం బయటపడినట్లు తెలుస్తోంది. యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.

యువతిని దారుణంగా చంపేసి ఓ సంచిలో కుక్కి పెద్దబండరాయి కట్టి కాల్వలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె శరీరం బండరాయి కట్టి ఉన్నట్లుగా గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు రెండు నెలల క్రితం ఈ హత్య జరిగినట్లుగా చెబుతున్నారు. కాల్వలో నీరు ఇంకిపోవడంతో యువతి శవం బయటపడినట్టుగా తెలుస్తోంది. బయటపడిన శవాన్ని పీక్కుతినడంతో అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

Also Read:

యువతి శరీరం ఛిద్రమై ఆనవాళ్లు కూడా తెలియనంత దారుణ స్థితిలో మృతదేహం ఉంది. అసలు ఈ హత్య అనంతపల్లిలోనే జరిగిందా? లేక ఎక్కడైనా చంపేసి ఇక్కడకు తెచ్చి పడేశారా? యువతి మృతదేహం కాల్వలో కొట్టుకొచ్చి ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యువతి ధరించిన దుస్తులు, వెండిపట్టీలు స్వాధీనం చేసుకుని ఆనవాళ్ల కోసం ఆరా తీస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here