దేశంలో అలా ఉంటే.. ఏపీలో ఇలా

భార‌త్‌లో క‌రోనా వ్యాధి ప‌ట్ల ఆందోళ‌న త‌గ్గుతోంది. ఎందుకంటే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నప్ప‌టికీ రిక‌వ‌రీ రేటు కూడా అంత‌కంత‌కూ పెరుగుతూ గుడ్ న్యూస్ ఇస్తూనే ఉంది. ఇది ఇలాగే పెరిగి వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఈ ప‌రిస్థితులే కొన‌సాగుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచనా వేస్తున్నారు.

క‌రోనా ప్రారంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌లితాలు ఎంతో ఆశాజ‌న‌కంగా ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. మొద‌ట్లో కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్నా రిక‌వ‌రీలు మాత్రం త‌క్కువ‌గా ఉండి భ‌యాందోళ‌న‌కు గురిచేసేవి. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా తారుమార‌య్యాయి. దేశంలో ప్ర‌తి రోజూ 80 వేలు, 90 వేల కేసులు న‌మోద‌య్యేవి.. తాజాగా అవి త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే మళ్లీ కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా పెర‌గ‌డం శుభ‌ప‌రిణామం.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 62.25 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదైతే ఇందులో 51.87 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు. 9.4 ల‌క్ష‌ల యాక్టీవ్ కేసులు ఉండ‌గా.. దేశ వ్యాప్తంగా 97,497 మంది క‌రోనాతో మృతి చెందారు. ఆగ‌ష్టు 1వ తేదీన 33.32 శాతం యాక్టీవ్ కేసులు ఉంటే.. సెప్టెంబ‌ర్ 30 నాటికి 15.11 శాతంకి త‌గ్గిన‌ట్లు నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. దీన్ని బ‌ట్టి దేశంలో కేసుల ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతూ ఉంది. మొన్న‌టి వ‌ర‌కు రోజూ 10వేల కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌గా ఇప్పుడు 6 వేలు, 7 వేల‌కు చేరాయి. ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. యాక్టీవ్ కేసులు 58,445 ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here