బాబ్రీ మ‌సీద్‌ కేసులో భార‌త్‌పై మండిప‌డ్డ పాక్‌..

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితుల‌ను నిర్దోషులుగా తేల్చుతూ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కోర్టు తీర్పును ప‌లువురు స్వాగ‌తిస్తుంటే.. ఎంఐఎం స‌హా ప‌లువురు వ్య‌తిరేకించారు..

ఇక బాబ్రీ తీర్పుపై దాయ‌దీ దేశం పాకిస్థాన్ త‌న వైఖ‌రిని ఎప్ప‌టిలాగే ప్ర‌ద‌ర్శించింది. భార‌త్ అంత‌ర్గత వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంది. బాబ్రీ మ‌సీదు తుది తీర్పు నేడు వ‌స్తున్న సంద‌ర్బంగా పాక్ మీడియా దీనిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చింది. కోర్టు ప్రారంభం కాక ముందునుంచి తీర్పు వెల‌వ‌రించే వ‌ర‌కు దీనిపైనే ఫోక‌స్ పెట్టింది.

నిందితుల‌ను నిర్దోషులుగా చెబుతూ కోర్టు తీర్పు చెప్ప‌డంపై పాక్ మండిప‌డింది. చారిత్ర‌క మ‌సీదు కూల్చివేత కేసులో నింద‌తులను విడిచిపెట్ట‌డం సిగ్గుచేట‌ని వ్యాఖ్య‌లు చేసింది.  తీర్పును ఖండిస్తున్నట్టు  పాకిస్తాన్ పేర్కొంది. ఇండియాలో ఉన్న మైనార్టీలు, ముస్లీంలు, వారి ప్రార్థ‌నా మందిరాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతున్నామ‌న్నారు. భారత్ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌డంపై పాకిస్థాన్‌పై భార‌త్ తీవ్రంగా మండిప‌డింది. ఇప్ప‌టికైనా త‌మ దేశంకు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌డం మానుకోవాల‌ని ఘాటుగా చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here