త్రిష జీవితాన్ని మార్చిన రోజు ఇది.!

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్నారు నటి త్రిష. 1999లో వచ్చిన ‘జోడి’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన త్రిష.. ‘వర్షం’ సినిమాతో తెలుగులోనూ ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఇక అనంతరం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేసిందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే తాజాగా తన జీవితంలో ఒక మధుర క్షణాన్ని అభిమానులతో పంచుకుంది త్రిష. 1999 సెప్టెంబర్‌ 30న అంటే ఇదే రోజు.. 16 ఏళ్ల క్రితం త్రిష మిస్‌ చెన్నై కిరీటాన్ని అందుకుంది. ఆ రోజు దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన త్రిష.. ‘30/09/1990.. ఈరోజు నా జీవితాన్ని మార్చిన రోజు’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లవుతోన్నా ఇప్పటికీ వరుస సినిమాలను చేస్తూ ఇప్పటికీ క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోందీ చెన్నై బ్యూటీ.

View this post on Instagram

30/09/1999👑 The day my life changed…❤️ #MissChennai1999

A post shared by Trish (@trishakrishnan) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here