నేను బాగున్నా ఆందోళ‌న‌ చెందొద్దు.. వెంక‌య్య‌నాయుడు

దేశంలో క‌రోనా సోకిన ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు ఎక్కువ‌వుతున్నారు. తాజాగా ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడుకు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. దీనిపై వెంక‌య్యనాయుడు స్పంద‌న‌ను ఉప‌రాష్ట్రప‌తి కార్యాల‌యం విడుద‌ల చేసింది.

క‌రోనా సోకినా తాను ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు వెంక‌య్య‌నాయుడు వెల్ల‌డించారు. ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారాయ‌న‌. తాను కోలుకోవాల‌ని కోరుకుంటున్న వారంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌తలు తెలిపారు. త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌న్నారు. క‌రోనా నుంచి కోలుకునేందుకు వైద్యుల సూచ‌న‌లు పాటిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. వెంక‌య్య‌నాయుడుకు క‌రోనా సోకిన విష‌యం తెలియ‌గానే దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్ర‌ముఖులు ఆయ‌న బాగుండాల‌ని కోరుకుంటూ కామెంట్లు చేశారు.

కాగా క‌రోనా ల‌క్ష‌ణాలు ఏమీ లేకుండానే ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయ్యింది. ఆయ‌న భార్య‌కు ఉషా నాయుడుకు మాత్రం నెగిటివ్ వ‌చ్చింది. పాజిటివ్ రావ‌డంతో వెంక‌య్య‌ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవ‌ల ఎంతో మంది ప్రజా ప్ర‌తినిధులు క‌రోనా సోకి అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. దీంతో త‌న అభిమానులు, ఆత్మీయులు ఆందోళ‌న చెంద‌కుండా ఉండేందుకు ఆయ‌న త‌న మెసేజ్‌ను పంపారు. తాను బాగున్న‌ట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here