మానాన్న నా మీద కేసు పెడతా అన్నారు .. నాతో మాట్లాడ్డమే లేదు

నెగెటివ్ పబ్లిసిటీ మీదనే ఈ మధ్య కాలం లో డైరెక్టర్ లూ ప్రొడ్యూసర్ లూ తమ సినిమాలు నడిపేస్తున్నారు .. ఎంతగా నెగెటివ్ పబ్లిసిటీ వస్తే ఆ సినిమా కి అంత జనం ఎగబడతారు మరి. అర్జున్ రెడ్డి సినిమా విషయం లో కూడా అదే జరిగింది పబ్లిసిటీ కోసం అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్ లు బయట వెలిసాయి వాటిని వీ హనుమంతరావు చింపేయడం దాంతో అది వైరల్ అవ్వడం, ఆ తరవాత మహిళా సంఘాలు అర్జున్ రెడ్డి సినిమా విడుదల కూడా అవ్వనివ్వం అంటూ గొడవ చెయ్యడం తెలిసిందే. ఈ వివాదం సినిమా విడుదల నే కాకుండా తన పరిస్థితులని కూడా బాగా ఎఫ్ఫెక్ట్ చేసింది అంటోంది హీరోయిన్ షాలినీ పాండే. తాజాగా ఈ సినిమా గురించి ఒక షో లో మాట్లాడిన ఆమె తన తనది ఒక సామాన్య కుటుంబం అని చెప్పుకొచ్చింది, తన తండ్రికి సినిమాలు అంటే అస్సలు ఇష్టం లేదు అన్న ఆమె అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్ ల విషయం లో ఇంట్లోవాళ్ళ తో నరకం చూసా అంటోంది.  ” నా సినిమా ప్రయత్నాలు చూసిన నాన్న నాతో మాట్లాడడం మానేశారు. నా మీద కేసు పెడతా అని కోప్పడ్డారు కూడా. ఈ ముద్దు పోస్టర్ లు ఆ గోల అదీ చూసాక ఆయన నాతో ఇక ఎప్పటికీ మాట్లాడరు అని నేను ఫిక్స్ అయిపోయాను. ఆయన మాట పక్కన పెట్టి చేసినందుకు అర్జున్ రెడ్డి చిత్రం నాకు మంచి భవిష్యత్తు ని ఇచ్చింది ” అంటోంది షాలిని .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here