లాక్‌డౌన్ వేళ‌.. సొంతూరికి సైకిల్‌పై 75 ఏళ్ల వృద్ధుడు 320 కిమీ ప్ర‌యాణం.. చివ‌ర్లో సీన్ రివ‌ర్స్‌

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో దేశవ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డే వ‌ల‌స కార్మికులు చిక్కుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం ర‌వాణా సౌక‌ర్యాల‌పై నిషేధం విధించ‌డంతో చాలామంది వ‌ల‌స కూలీలు కాలిన‌డ‌క ద్వారానే వేలాది కిలోమీట‌ర్ల దూరంలోని త‌మ సొంత ఊళ్ల‌కు చేరుకుంటున్నారు. తాజాగా ప‌శ్చిమ బెంగాల్లోని 75 ఏళ్ల వృద్ధుడు అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి ప‌క్క రాష్ట్రం బీహార్ నుంచి త‌న సొంత‌గ్రామానికి చేరుకున్నాడు.

Must Read:

బెంగాల్‌కు చెందిన సూర్య‌కాంత చౌద‌రీ.. బీహార్లోని సూపాల్ మార్కెట్‌కు నిత్యం చేప‌ల‌ను విక్ర‌యిస్తాడు. ఈ నేప‌థ్యంలో గతనెలలో అక్క‌డికివెళ్లాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో అయ‌న అక్క‌డే చిక్కుకుపోయారు. తాజాగా త‌న ద‌గ్గ‌రున్న వ‌న‌రుల‌న్నీ అయిపోవ‌డంతో సొంతూరికి వెళ్లేందుకు 320 కిమీ దూరానికి సైకిల్‌ ప్ర‌యాణం చేశాడు. మూడు రోజుల‌పాటు ప్ర‌యాణం చే‌సి వ‌చ్చిన అత‌ణ్ని.. గ్రామంలోకి అనుమంతించేందుకు గ్రామ‌స్తులు నిరాక‌రించారు.

Must Read:

దీంతో ఆయ‌న స్థానిక విలేజ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస్‌కు వెళ్లి, త‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని కోరాడు. అత‌ణ్ని ప‌రీక్షించ‌డంతోపాటు 14 రోజుల‌పాటు క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. ఇక ప‌శ్చిమ బెంగాల్లో 570కిపైగా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. 18 మంది మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here