లాక్‌డౌన్ తర్వాత భారీగా పడిపోయిన పాజిటివ్ కేసుల వృద్ధి రేటు.. ఎంతంటే?

దేశంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అయితే, పెరుగుదల రేటు మాత్రం తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 3.5 రోజులు పడితే.. ఈ వారం ప్రారంభంలో 7.5గా.. ప్రస్తుతం రోజుల సమయం పడుతుంది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిన 14 రోజుల్లో 80 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. దీనికంతటికీ లాక్‌డౌన్ విధించడం.. ప్రజలు సామాజిక దూరం తప్పనసరిగా పాటించడం కారణమని కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్ విధించాక.. ప్రజలు, అధికార యంత్రాంగం సమష్టి కృషితో కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగామని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ కట్టిడికి మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. అప్పటికి దేశంలో పాజిటివ్ కేసులు 500గా నమోదయ్యాయి.

లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 24 నాటికి పాజిటివ్ కేసుల సగటు పెరుగుదల రేటు 21.6 శాతం ఉండగా.. నెల రోజుల తర్వాత అది 8.1 శాతానికి పడిపోయింది. అప్పటి మాదిరిగా పెరుగుదల రేటు కొనసాగితే దేశంలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలుకు చేరుకునేది. లాక్‌డౌన్ ఐదో వారంలోని మూడు రోజులకు 8.1% వృద్ధి రేటు వైరస్ కల్లోలానికి ప్రభావితమైన దేశాలు సాధించిన దానికంటే ఎక్కువగా ఉంది. జర్మనీ కొత్త కేసుల వృద్ధి రేటు 2 శాతానికి తగ్గించగా, అమెరికాలో ఇది 4.8 శాతంగా ఉంది. దేశంలో కొత్త కేసుల వృద్ధి రేటు ప్రస్తుత 8.1 శాతంగా కొనసాగితే వచ్చే వారాంతానికి 40వేల మార్క్‌కు చేరుకుంటాయి. తర్వాత పదిహేను రోజులకు 70వేలు.. మే చివరినాటికి 2.5 లక్షలుగా నమోదవుతుంది.

కేరళలో వృద్ధి రేటు జర్మనీ కంటే తక్కువ (1.8 శాతం)గా ఉండటం విశేషం. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుంది. కొద్ది శాతం తగ్గినా కొత్త కేసుల విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటు 8.1 నుంచి 6 శాతానికి తగ్గితే నెల రోజుల తర్వాత దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 1.3 లక్షలు చేరుతాయి. అదే 5 శాతానికి తగ్గితే లక్షలోపే ఉంటాయి.

గ్రీన్ జోన్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా చూడటం, ఈ జాబితాలోకి మరిన్ని జిల్లాలను చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (6430), గుజరాత్ (2624), ఢిల్లీ (2376) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here