లాక్‌డౌన్‌లో బయటికెళ్లిన కొత్తజంట.. ఇంటి నుంచి గెంటేసిన ఓనర్

లాక్‌డౌన్‌తో ఖాళీగా ఉండలేక బంధువుల ఇళ్లకు తిరుగుతున్న కొత్తజంటకి ఇంటి ఓనర్ ఊహించని షాకిచ్చాడు. అర్ధరాత్రి తలుపులు మూసేసి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తెస్తేనే ఇంట్లోకి ఎంట్రీ అని తెగేసి చెప్పడంతో గత్యంతరం లేక కారులోనే జంట రాత్రంతా గడిపాల్సి వచ్చింది. చివరికి పోలీసుల సాయంతో జంట మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఈ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

తుమకూరు జిల్లా సిరా గ్రామానికి చెందిన రంగా(25), పవిత్ర భార్యాభర్తలు. ఇటీవల వారికి వివాహమైంది. బెంగళూరులో కారుడ్రైవర్‌గా పని చేస్తున్న రంగా బాగలగుంటె పరిధిలోని బృందావన్ లేఔట్‌లో అద్దెకు ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో ఖాళీగా ఉండడంతో భార్యాభర్తలు సరదాగా బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. అలా రెండుసార్లు బయటికి వెళ్లి మూడు, నాలుగు రోజుల తర్వత తిరిగి వస్తుండడం ఇంటి ఓనర్ శివన్న గమనించాడు.

Also Read:

ఓ రోజు బయటి నుంచి ఇంటికొస్తున్న రంగా, అతని భార్యను శివన్న అడ్డుకున్నాడు. ఎక్కడెక్కడో తిరిగి వస్తే ఒప్పుకునేది లేదని.. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తెస్తేనే ఇంట్లోకి ఎంట్రీ అని తెగేసి చెప్పాడు. సడెన్‌గా ఓనర్ ఇచ్చిన ట్విస్టుకి షాక్ తిన్న దంపతులు కారులోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. ఉదయాన్నే విషయాన్ని స్థానిక జయరాజ్ నాయుడికి మొరపెట్టుకోవడంతో ఆయన ఓనర్ శివన్నకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

అయినా ఓనర్ వెనక్కి తగ్గలేదు. మళ్లీ మళ్లీ బయట తిరిగి వస్తున్నారని.. కరోనా నెగెటివ్ రిపోర్ట్ తెస్తేనే ఇంట్లోకి రానిస్తానని జయరాజ్‌కి స్పష్టం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. చివరికి రంగా కట్టిన అడ్వాన్స్ మొత్తం తిరిగిచ్చేసేందుకు ఒప్పుకున్న ఓనర్.. వారిని ఇంట్లోకి రానిచ్చేందుకు మాత్రం ససేమిరా అన్నాడు. రంగా దంపతులు ఆ ప్రాంతంలోనే మరో ఇంటికి మారారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here