దేశంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు.. 32 వేలకు చేరువలో కేసులు

భారత్‌లో కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటింది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 31,787కు చేరగా.. మరణాల సంఖ్య 1008గా నమోదైంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 71 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం నుంచి దేశంలో కొత్తగా 1813 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,982గా ఉంది.

ఇప్పటి వరకూ మన దేశంలో 7796 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఒకరు వేరే దేశానికి వెళ్లారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 24.52 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

గత 24 గంటల్లో దేశంలో 71 కోవిడ్ మరణాలు సంభవించగా.. ఇందులో 31 మంది మహారాష్ట్రలోనే చనిపోయారు. గుజరాత్‌లో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మధ్యప్రదేశ్‌లో ఆరుగురు; రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో ఐదుగురు చొప్పున కరోనాకు బలయ్యారు. బెంగాల్‌లో ఇద్దరు చనిపోగా.. జమ్మూ కశ్మీర్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

ఇప్పటి వరకూ అత్యధికంగా మహారాష్ట్రలో 400 మంది చనిపోగా.. గుజరాత్‌లో 181 మంది, మధ్యప్రదేశ్‌లో 119 మంది, ఢిల్లీలో 54 మంది, రాజస్థాన్‌లో 51 మంది, యూపీలో 36 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 31 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here