రౌడీషీటర్‌ దారుణ హత్య.. కత్తులతో తూట్లుగా పొడిచేసిన మైనర్లు

సప్త సముద్రాలు ఈదినోడు పిల్ల కాల్వలో పడి చనిపోయాడన్నట్లు ఓ భయంకరమైన క్రిమినల్ పిల్లల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన చోటచేసుకుంది. పలు పోలీస్ స్టేషన్లలో 17 క్రిమినల్ కేసులున్న వ్యక్తిని మైనర్లు కత్తులతో తూట్లుతూట్లుగా పొడిచేశారు. చిన్న వివాదం చినికిచినికి హత్యకు దారితీసింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగింది.

నిజాముద్దీన్ పరిధిలోని ఖుస్రో నగర్‌కి చెందిన హసిన్(32) కూరగాయల బండి పెట్టుకురే విషయమై స్థానిక మహిళతో గొడవ పెట్టుకున్నాడు. వివాదం ముదిరి హత్యకు దారితీసింది. తన తల్లితో గొడవ పెట్టుకున్న హసిన్‌ని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్న మైనర్ బాలుడు తన స్నేహితులతో కలసి హత్యకు ప్లాన్ చేశాడు. ఇద్దరు మైనర్లు సహా మరో యువకుడితో కలసి హసిన్‌పై కత్తులతో దాడి చేశారు.

Also Read:

హసిన్ శరీరాన్ని తూట్లుతూట్లుగా పొడిచేశారు. దీంతో సంఘటన స్థలంలోనే హసిన్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న అతని భార్య కాజల్ పోలీసులకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పరిశీలించి హత్యకు కారణాలపై ఆరా తీశారు. చివరి సారిగా ముగ్గురు యువకులతో చూశామని స్థానికులు చెప్పడంతో ఆ దిశగా విచారణ చేపట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు మైనర్ బాలురతో సహా మరో యువకుడు నిఖిల్(20) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్‌ని అరెస్టు చేసి జైలుకి పంపారు. మైనర్లని జువైనల్ హోమ్‌కి తరలించారు. తన తల్లితో గొడవ పెట్టుకున్నందుకే హసిన్ చంపినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here