యూట్యూబ్ యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌..వీడియోల్ని వేగంగా చూసేయండి

యూజ‌ర్ల‌కు ఆక‌ట్టుకునేందుకు యూట్యూబ్ కొత్తఒర‌వ‌డిని సృష్టించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇన్నిరోజులు యూట్యూబ్ లో మొత్తం వీడియో స్పీడుగా  అగ‌చాట్లు ప‌డాల్సి వ‌చ్చేది. అయితే కొత్త వెర్ష‌న్ తో  ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్ల‌లోని వీడియోల‌ను వేగ‌వంతంగా  వీక్షించే అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఇంత‌కుముందు మ‌నం చూడాల‌నుకున్న వీడియో స్పీడుగా చూడాలంటే కుదిరేదికాదు. కానీ ఇప్పుడు అలా కాదు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ స్పీడ్‌ను క‌నిష్టంగా 0.25 నుంచి 2 రెట్ల వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. వీడియో వీక్షించే స‌మ‌యంలో సెట్టింగ్ ఆప్ష‌న్స్ నుంచి  వీడియో ప్లేబ్యాక్‌ను మార్చుకోవ‌చ్చు. ఈ సదుపాయం కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో మాత్ర‌మే ల‌భ్యం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here