గౌతమ్ టీమ్ అక్కడ ఎందుకు చిక్కుకుంది?

ఏ మాయచేశావే, ఘర్షణ, ఎటో వెళ్లిపోయింది మనసు, సాహసమే శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నతమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ గుర్తున్నాడా అండీ. ఇప్పుడు పాపం ఆయన టీమ్ అష్టకష్టాలు పడుతున్నారంటండీ పాపం. ఇక్కడ కాదులెండి. దేశం కాని దేశంలో.. ముక్కూ మొహం తెలియని చోట నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ రక్షించమంటూ ప్రాధేయపడుతున్నాడు.
విషయంలోకి వెళ్తే విక్రమ్ హీరోగా నటిస్తున్న ధ్రువనక్షత్రం సినిమాను గౌతమ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో భాగంగా.. చిత్ర యూనిట్ టర్కీకి వెళ్లింది. ముందు జార్జియాకు వెళ్లి అక్కడ నుంచి టర్కీకు వెళ్తుండగా సరిహద్దుల్లో టర్కీ అధికారులు చిత్ర యూనిట్ ను అడ్డుకున్నారు. షూటింగ్ కోసం అన్నిఅనుమతులు తీసుకున్నామని చెబుతున్నా అధికారులు వినలేదంట. చిత్ర యూనిట్ ను నిర్భంధించి 24 గంటలు గడిచిపోయిందంట.
టర్కీలాంటి అందమైన దేశంలో షూటింగ్ చేయాలనుకున్నామని, అక్కడి అధికారులకు ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని ఆయన ట్విటర్ లోవాపోయాడు. తమ చిత్ర యూనిట్ ను రక్షించాలని మొరపెట్టుకుంటున్నాడు. ఎవరైనా సాయమందించాలని ట్విటర్ లో అర్థిస్తున్నాడు. అయ్యో గౌతమ్ మీనన్ కు ఎంత కష్టమొచ్చిందండీ పాపం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here