తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించనుంది. సంవత్సరాల కొద్ది కష్టమర్లను మోసం చేసి అక్రమాస్తులు సంపాదించిన అగ్రిగోల్డ్ ఎట్టకేలకు కోర్టు తీర్పుతో బాధితులకు న్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజల్ని మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్థుల్ని జప్తు చేసి బాధితులకు న్యాయం చేసేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఇందులో భాగంగా జీ గ్రూప్ సంస్థ అధినేత సుభాష్ చంద్ర అగ్రిగోల్డ్ ఆస్థుల్ని కొనుగోలు చేసి బాధితులకు పరిహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఏపీ క్యాబినేట్ భేటీలో చర్చించినట్లు సీఎం చంద్రబాబు తెలుపారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ అస్ధులు ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు వేలకోట్లు కాగా మార్కెట్ ప్రకారం పదివేల కోట్లు ఉంటుందని అంచనా . ఒకవేళ జీ గ్రూప్ మొత్తం ఆస్థుల్ని కొనుగోలు చేస్తే ఎన్నోఏళ్లుగా ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్న ప్రజలకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది.
