భార్య నగ్నచిత్రాలు ఫ్రెండ్స్‌కి.. వారితో సెక్స్ చేయాలని వేధింపులు.. చివరికి..

పెళ్లైన ఏడాదికే ఆమె జీవితం నరకమైంది. కట్టుకున్నవాడే కీచకుడిగా మారి దారుణానికి ఒడిగట్టాడు. భార్య నగ్న ఫొటోలు తీసి ఫ్రెండ్స్‌కి పంపి పైశాచికానందం పొందేవాడు. స్నేహితులతో సెక్స్ చేయాలని వేధింపులకు గురిచేసేవాడు. కొద్దికాలం మౌనంగా భరించిన భార్య.. వేధింపులు తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడింది. చనిపోయే భర్త దురాగతాలను పేపర్‌పై పెట్టి ప్రాణాలు తీసుకుంది. ఈ అత్యంత దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

భర్త నీచ కోరికలు తీర్చలేక భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గ్వాలియర్‌ నగరంలోని గోస్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గోస్పుర ఏరియాలో నివాసం ఉంటున్న గీత, రాజీవ్ (పేర్లు మార్చాం)కి ఏడాది కిందట వివాహమైంది. కొద్దికాలం బాగానే చూసుకున్న భర్త క్రమంగా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు.

Also Read:

భార్యని నగ్నంగా ఫొటోలు తీసి తన స్నేహితులకు పంపేవాడు. కొద్దిరోజుల తర్వాత స్నేహితులతో సెక్స్ చేయాలని వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. భర్త నీచ కోరికలు తీర్చలేక గీత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త దారుణాలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here