మహారాష్ట్రలో 20 వేలు దాటిన కరోనా కేసులు, ఆ రెండు రాష్ట్రాల్లోనే 60 శాతం మరణాలు

మహారాష్ట్రలో కేసుల సంఖ్య 20 వేలు దాటింది. శనివారం 1165 కొత్త కేసులు నమోదు కాగా.. మరో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 20,228కి చేరింది. దేశంలో 60 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క మహారాష్ట్రలో మూడొంతుల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ 12864 కరోనా కేసులు నమోదు కాగా.. 489 మంది చనిపోయారు. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3800 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

థానే డివిజన్ పరిధిలో 15,595 కేసులు నమోదు కాగా.. 524 మంది చనిపోయారు. నాసిక్ డివిజన్‌లో 857 కేసులు, పుణే డివిజన్‌లో 2513 కేసులు, కొల్హాపూర్ డివిజన్‌లో 77, ఔరంగాబాద్ డివిజన్‌లో 514, లాథూర్ డివిజన్లో 62, అకోలా డివిజన్‌లో 345, నాగపూర్ డివిజన్లో 230 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కోవిడ్ బారిన పడి మొత్తం 779 మంది ప్రాణాలు కోల్పోయారు.

పొరుగున ఉన్న గుజరాత్‌లో 7797 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 472 మంది చనిపోయారు. అహ్మదాబాద్ నగరంలోనే 5540 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని కరోనా కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనే 45 శాతానికిపైగా కేసులు, 50 శాతానికిపైగా కరోనా మరణాలు నమోదు కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here