ప్రియుడి మోజులో మహిళనీచం.. కూతురికి నిద్రమాత్రలిచ్చి నరకం.. చివరికి..

అమ్మ అనే మాటకే మాయని వచ్చ తెచ్చిందో రాక్షసి. బిడ్డను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి ప్రియుడి మోజులో అత్యంత నీచానికి దిగజారింది. కట్టుకున్న భర్తను మోసం చేసి ప్రియుడితో రాసలీలలు సాగించడమే కాకుండా కన్నకూతురి జీవితాన్ని బలి చేసింది. కూతురికి నిద్రమాత్రలిచ్చి పడుకోబెట్టి ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించేది. తల్లి బెదిరించి నోరు తెరవకుండా చేయడంతో ఏడాదిగా కూతురు నరకం చవిచూసింది. తల్లి దాష్టీకాన్ని భరించలేకపోయిన కూతురు విషయం తండ్రికి చెప్పడంతో తల్లి, ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు. ఈ అమానుష ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో వెలుగుచూసింది.

కన్నతల్లే నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో కలసి ఏడాదిగా తనకు నరకం చూపించిందంటూ పద్నాలుగేళ్ల మైనర్ బాలిక హోషియార్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు వివరాలు.. హోషియార్‌పూర్‌కి చెందిన వివాహితకు అమర్జీత్ సింగ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త పనికి వెళ్లిన తరువాత అమర్జీత్ ఇంటికి వచ్చేవాడు. ఆమె పద్నాలుగేళ్ల కూతురు ఇంట్లోనే ఉన్నా ఇద్దరూ రాసలీలలు సాగించేవారు.

Also Read:

అమర్జీత్‌ని కలిసేందుకు ఆమె కూడా బయటకు వెళ్తుండేది. అప్పడప్పుడూ తన కూతురిని కూడా వెంటబెట్టుకెళ్లేది. ప్రియురాలి కూతురిపై కన్నేసిన అమర్జీత్ కూతురితో వెకిలిచేష్టలు చేసినా ఆమె కూతురినే తిట్టి నోరుమూయించేది. కొద్దికాలం తర్వాత కూతురికి రాత్రి వేళ నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టి ప్రియుడు అమర్జీత్‌కి ఫోన్ చేసి రప్పించి నీచానికి పాల్పడింది. నిద్రమత్తులో ఉన్న బాలికను అమర్జీత్ దారుణంగా రేప్ చేసేవాడు. రాక్షసంగా కామవాంఛలు తీర్చుకునేవాడు.

Read Also:

సుమారు ఏడాది పాటు బాలిక నరకం అనుభవించింది. కొన్నిసార్లు బాలిక ఆరోగ్యం బాలేదని చెప్పినా తల్లి పట్టించుకోకపోగా ఏమీ కాలేదని కొట్టిపారేసేది. ప్రియుడి మోజులో తల్లి అకృత్యాలను భరించలేకపోయిన బాలిక రాత్రి వేళ భోజనం చేయడం మానేసింది. తల్లి నీచ ప్రవర్తన తట్టుకోలేక విషయాన్ని తండ్రికి చెప్పుకుని భోరుమనడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తల్లి, ఆమె ప్రియుడు అమర్జీత్‌ని పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here