ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. కిరాతకంగా చంపి దహనం చేసిన తల్లి

ప్రేమించిన కారణానికి ఓ యువతి కన్నతల్లి చేతిలోనే దారుణహత్యకు గురైన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. హోషియాపూర్‌కు చెందిన బల్వీందర్‌ కౌర్‌ కుమార్తె(19).. భల్జాన్‌ గ్రామానికి చెందిన అమన్‌ ప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ విషయం ఆమె తల్లికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆ యువతి తల్లికి తెలియకుండా ఇంటి నుంచి పారిపోయి ప్రియుడి దగ్గరకు చేరుకుంది. దీంతో తన కూతురు కనిపించడం లేదని బల్వీందర్ కౌర్ ఈ నెల 22వ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read:

తన కూతురు ప్రియుడి వద్దకు వెళ్లిందని తెలుసుకున్న ఆమె తన బంధువు సదేవ్, సీఎంవోలో పనిచేసే పోలీస్ గుర్దీప్ సింగ్ సహా మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో పంచాయతీ పెట్టింది. తన కూతురిని అమన్‌కిచ్చి పెళ్లి చేస్తానని, ఇప్పుడు తనతో పంపించాలని ఆమె కోరింది. దీంతో అమన్ తన ప్రియురాలికి నచ్చజెప్పి తల్లితో పంపించాడు. ప్రియుడితో వెళ్లిపోయి కూతురు తన పరువు తీసిందని బల్వీందర్ పగ పెంచుకుంది. దీంతో ఏప్రిల్ 25వ తేదీన కూతురు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది.

Also Read:

ఆమె నిద్రలోకి జారుకున్నాడ తన బంధువు శివరాజ్, లాలాను ఇంటికి పిలిపించింది. వారిద్దరు నిద్రలో ఉన్న యువతిని గొంతు నులిమి చంపేశారు. అనంతరం శవాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బల్వీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు ఈ హత్యలో పాల్గొన్న నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here