పొలంలో పని చేసుకుంటున్న మహిళ కిడ్నాప్.. 13 రోజులు నిర్బంధించి నరకం..

మహిళలపై నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా నడవడం అటుంచి పట్టపగలే తిరలేని పరిస్థితులు దాపురించాయి. పగటిపూట పొలంలో పని చేసుకుంటున్న మహిళను అపహరించి గ్యాంగ్‌ రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు సుమారు రెండువారాల పాటు నిర్బంధించి నరకం చూపారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.

రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న మహిళను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. పదమూడు రోజులు ఆమెను బంధించి నరకం చూపించారు. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Also Read:

ఏప్రిల్ 3వ తేదీన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్బంధించి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ నెల 15 వరకూ నిందితులు తనను బంధించి గ్యాంగ్ రేప్ చేశారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here