మంత్రికి కరోనా పాజిటివ్… పది రోజుల కిందట నెగటివ్ రిపోర్ట్

మహారాష్ట్రలో ఓ మంత్రి కరోనా బారిన పడ్డారు. హౌసింగ్ మినిస్టర్ జితేంద్ర అవహద్‌కు కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో 54 ఏళ్ల ఈ ఎన్సీపీ నేత థానేలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరారు. ఏప్రిల్ 13న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ రాగా ఇప్పుడు పాజిటివ్ రావడం గమనార్హం. ఆయనతోపాటు నిత్యావసరాలను పంపిణీ చేసిన 36 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 17న వారికి నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఓ పోలీసు ఆఫీసర్ వల్ల మంత్రికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్ ఆరంభంలో లాక్‌డౌన్, లా అండ్ ఆర్డర్ గురించి చర్చించడానికి ముంబ్రా పోలీస్ స్టేషన్లో ఓ సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ను జితేంద్ర కలిశారు. ఆ పోలీసు అధికారి సెలవు మీద తన సొంతూరైన నాసిక్ వెళ్లగా… గతవారం ఆయనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది.

ముంబ్రాలో తబ్లీగీ జమాత్ సభ్యులను పట్టుకునే ఆపరేషన్లో ఈ ఆఫీసర్ పాల్గొన్నారు. ఢిల్లీ తబ్లిగీ విషయం వెలుగు చూశాక.. 13 మంది బంగ్లాదేశీయులు, 8 మంది మలేసియన్లను ముంబ్రాలో అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా కొందరు ముంబ్రా వాసులకు కరోనా వచ్చి ఉంటుందని.. వారి నుంచి ఈ ఆఫీసర్‌కు సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

సదరు పోలీసు ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మంత్రి సహా ఆయనతో కాంటాక్ట్ అయిన 100 మందికి థానే మున్సిపల్ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here