పెళ్లి కాలేదని నమ్మించి గర్భవతిని చేసి.. నెల్లూరులో దారుణం

వాట్సాప్ పరిచయం ఓ యువతి కొంపముంచింది. పెళ్లి కాలేదని యువతిని నమ్మించి వివాహమాడాడో ప్రబుద్ధుడు. ఆమెతో కాపురం చేసి గర్భవతిని చేశాడు. తీరా సొంతూరుకి మకాం మార్చు సరికి అతగాడి బాగోతం బయటపడింది. భర్త సరిగ్గా ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన మహిళకు దిమ్మతిరిగిపోయింది. అప్పటికే అతనికి పెళ్లై భార్య ఉందని తెలియడంతో షాక్‌కి గురైంది. చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన నెల్లూరులో వెలుగుచూసింది.

నగరానికి చెందిన షేక్ అహ్మద్‌కి వాట్సాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. తనకు పెళ్లి కాలేదని యువతిని నమ్మించిన అహ్మద్ ఆమెను గుంటూరులో వివాహం చేసుకున్నాడు. అక్కడే అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. మూడు నెలల తర్వాత సొంతూరు నెల్లూరుకు మకాం మార్చాడు. స్థానికంగా జ్యోతినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. ఆమెను గర్భవతిని చేశాడు.

Also Read:

అయితే కొద్దిరోజులుగా భర్త సరిగ్గా ఇంటికి రాకపోతుండడంతో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. అహ్మద్‌కి అప్పటికే పెళ్లైందని తెలియడంతో షాక్‌కి గురైంది. అహ్మద్ మరో మహిళతో ఉంటున్న విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆమె, తన అత్త, మరిదితో కలసి యువతిపై దాడికి దిగింది. ఆమె మెడలోని తాళిని తెంచుకుని లాక్కెళ్లింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి కాలేదని నమ్మించి తనను మోసం చేసి గర్భవతిని చేశాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here