పెళ్లాం పక్కింటికెళ్లిందని దారుణం.. గొంతుపిసికి చంపేసిన మొగుడు

తనకు చెప్పకుండా పొరుగింటికి వెళ్లిందన్న ఆగ్రహంతో ఐదు నెలల గర్భిణిని అమానుషంగా చంపేశాడో కసాయి భర్త. భార్యతో గొడవపడి ఆమె గొంతుపిసికి హత మార్చాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి భార్యను చంపేశానని లొంగిపోవడంతో పోలీసులు షాక్‌కి గురయ్యారు. పోలీసులు ఇంటికి వెళ్లి చూసే సరికి అతని భార్య విగతజీవిగా కనిపించింది. ఈ దారుణ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది.

కట్టుకున్న భార్యను భర్తే దారుణంగా హత్య చేసిన ఘటన సౌత్ దక్షిణ్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. అంబేద్కర్ నగర్‌‌కి చెందిన విజయ్, హేమలత(30) దంపతులు. లాక్‌డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటున్నారు. సాయంత్రం సమయంలో భర్త విజయ్ నిత్యవసర సరుకులు తెచ్చేందుకు బయటికి వెళ్లాడు. అదే సమయంలో హేమలత తమ ఇంటికి సమీపంలోనే ఉన్న ఆడపడుచు ఆశ ఇంటికి వెళ్లింది.

Also Read:

సరుకులు తీసుకుని తొరిగొచ్చేప్పటికి ఇంటికి తాళం వేసి ఉండడంతో విజయ్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లిందని కోపంతో రగిలిపోయాడు. కొద్దిసేపటికి ఆమె ఇంటికి తిరిగి రావడంతో గొడవకు దిగాడు. చెప్పకుండా ఎక్కడికి వెళ్లావంటూ నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. దీంతో ఉన్మాదిగా మారిన విజయ్.. భార్య హేమలతో గొంతుపిసికి చంపేశాడు. ఊపిరాడకుండా చేసి అంతమొందించాడు.

అనంతరం అర్ధరాత్రి 12.30 గంటలకు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన భార్యను చంపేశానని చెప్పి లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది ఇంటికి వెళ్లి చూడడంతో ఆమె విగతజీవిగా కనిపించింది. బెడ్రూమ్‌లో పడి ఉన్న హేమలత మెడపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్, ఫోరెన్సిక్ టీంలు రప్పించి ఆధారాలు సేకరించారు. ఎవరితో మాట్లాడొద్దంటూ తన అన్న విజయ్ వదిన హేమలతని వేధింపులకు గురిచేసేవాడని చెల్లెలు ఆశ ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here