పెట్రోల్‌కి గతిలేని నీకు బండెందుకన్న తండ్రి.. చంపేసిన కొడుకు.. ప్రకాశంలో దారుణం

పెట్రోల్ పోయించుకోలేనప్పుడు బండెందుకని మందలించిన కన్నతండ్రిని దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు. అప్పుల కట్టలేక ఆటో తీసుకెళ్లిపోయినా బైక్ కావాలని గొడవ చేయడంతో విధిలేని పరిస్థితిలో కొనిచ్చాడు. ఆఖరికి పెట్రోల్ కొట్టించమంటూ నిత్యం వేధింపులకు గురిచేస్తుంటే భరించలేక తిట్టేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొడుకు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

పెద్దారవీడు మండలం తంగిరాలపల్లె ఎస్సీ కాలనీకి చెందిన లింగాల సుబ్బయ్య కుమారుడు మరియదాసు ఫైనాన్స్‌లో ఆటో కొనుక్కున్నాడు. నుంచి తంగిరాలపల్లెకు తిప్పుకునేవాడు. వరుసగా ఆటో ఈఎంఐ‌లు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు రెండు నెలల కిందట ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అయినా మరియదాసులో మార్పు రాలేదు.

Also Read:

ఆటో తీసుకెళ్లిన కొద్దికాలానికే తనకు బైక్ కావాలని తండ్రిని వేధించడం మొదలుపెట్టాడు. కొడుకు ఒత్తిడి తట్టుకోలేక బైక్ కొనిచ్చాడు. అప్పటి నుంచి పెట్రోల్‌కి డబ్బులు అడగడం ప్రారంభించాడు. నిత్యం పెట్రోల్‌కి డబ్బులు కావాలని అడుగుతుండడంతో విసుగుచెందిన తండ్రి.. పెట్రోల్ పోయించుకోలేని నీకు బండెందుకురా అని తీవ్రంగా మందలించాడు.

తండ్రి మాటలకు కోపంతో ఊగిపోయిన కొడుకు మరియదాసు అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న తండ్రి తలపై రోకలి బండతో కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన సుబ్బయ్యని స్థానికులు ఆటోలో మార్కాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here