గుడ్‌న్యూస్.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి ఎప్పుడొస్తారంటే..?

కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్ సెక్ర‌ట‌రీ రాజీవ్ గౌబా.. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీలు, పోలీస్ బాస్‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు. వ‌చ్చేనెల 3న లాక్‌డౌన్ ముగియ‌నుండ‌టంతో కేంద్ర విదేశాంగ నేతృత్వంలో ఈ ఏర్పాట్లను చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి ప్ర‌త్యేక విమానాల ద్వారా రాబోయే భార‌తీయుల‌కు సంబంధించి క్వారంటైన్ ఏర్పాట్లు చేయాల‌ని కేంద్రం.. ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు స‌మాచార‌మిచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Must Read:

మ‌రోవైపు సోమ‌వారం నుంచి క‌రోనా వైర‌స్ ప‌రిస్థితిపై స‌మీక్షించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌మావేశ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు విదేశాల నుంచి భారతీయుల‌ను ర‌ప్పించడానికి చేసే ఏర్పాట్లకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని అధికారులు భావిస్తున్నారు.

Must Read:

అమెరికా, గ‌ల్ఫ్ స‌హా అనేక దేశాల్లో భార‌తీయులు నివాస‌ముంటున్న సంగతి తెలిసిందే. ఒక్క కేర‌ళ నుంచే వివిధ దేశాల్లో దాదాపు ల‌క్ష‌మందికిపైగా వ‌ల‌స వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక విమానాల్లో వీరంద‌రినీ ర‌ప్పించేందుకు కేంద్రం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. వ‌చ్చేనెల తొలివారంలో దీనిపై త‌గిన స్ప‌ష్ట‌త రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here