కరోనా తగ్గేందుకు ట్రంప్ తుంటరి సలహా.. విరుచుకుపడుతున్న డాక్టర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మళ్లీ తెంపరి వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ అమెరికాలో రోజురోజుకూ ఎక్కువవుతున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఇచ్చిన ఉచిత సలహాతో ఇప్పుడు అమెరికాలో వైద్య నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రెస్‌మీట్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు అనుసరించే ప్రమాదం ఉందని గ్రహించిన వైద్య నిపుణులు.. ఆ వ్యాఖ్యలను ఖండించారు. అలాంటి పిచ్చి చేష్టలు ఎవరూ ప్రయత్నించవద్దని చెబుతున్నారు.

ఇంతకీ ట్రంప్ ఏం మాట్లాడారంటే..

దేశంలో అదుపు చేసేందుకు జరుగుతున్న చర్యలపై నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా సోకిన వ్యక్తి శరీరంలోకి డిస్ఇన్ఫెక్టంట్లను (క్రిమి సంహారకాలు) ఎక్కించడం ద్వారా కరోనా వైరస్ నాశనమవుతుందని వ్యాఖ్యానించారు. వైద్య నిపుణులు తన సలహా పరిశీలించాలని కూడా అన్నారు. అంతేకాక, శరీరంలోకి అతినీల లోహిత కిరణాలను పంపించడం ద్వారా కూడా ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూడాలని ట్రంప్‌ సూచించారు.

‘‘డిస్‌ఇన్ఫెక్టెంట్‌లు ఒకే నిమిషంలో వైరస్‌ను నాశనం చేసేస్తాయి. అయితే, మనిషి శరీరంలోని దానిని పంపించేందుకు మార్గం ఉందా? వైరస్‌ను శరీరం నుంచి పారద్రోలగలమా? ఎందుకంటే ఆ వైరస్‌ ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఉండటం అందరికీ తెలిసిందే. అది చాలా ఎక్కువగా ఉంటోంది. అందుకే ఈ సూచన ఓ సారి పరీక్షిస్తే బాగుంటుంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాటలు విని..

అంతకుముందు అదే ప్రెస్ మీట్‌లో బిల్‌ బ్రియన్‌ అనే నిపుణుడు నిర్వహించిన ఓ అధ్యయన ఫలితాలను ట్రంప్ ఎదుటే చెప్పారు. సూర్యరశ్మి, గాలిలోని తేమ (హ్యుమిడిటి) ఉన్నప్పుడు కరోనా వైరస్‌ అత్యంత వేగంగా నశిస్తోందని తాము గుర్తించినట్లు చెప్పారు. ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ కేవలం 30 సెకన్లలో కరోనా వైరస్‌ను నాశనం చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు ట్రంప్ ఎదుటే బిల్ బ్రియన్ చెప్పారు. ఈ మాటలు విన్న ట్రంప్.. తాను మాట్లాడే సమయంలో కరోనాను తగ్గించేందుకు మనిషి శరీరంలోకి డిస్ఇన్ఫెక్టెంట్లను ఎందుకు ఎక్కించొద్దనే ప్రశ్నను లేవనెత్తారు.

Also Read:

ట్రంప్‌ చేసిన ఈ షాకింగ్ వ్యాఖ్యలతో అమెరికాలోని వైద్య నిపుణులు విమర్శలు మొదలుపెట్టారు. అధ్యక్షుడు ఇచ్చిన అత్యంత ప్రమాదకరమైన సలహా పాటించవద్దని వారు ప్రజలకు సూచించారు. ట్రంప్ సలహా బాగుందని ఎవరైనా ప్రజలు దాన్ని అనుసరించగలరు.. అలా చేస్తే చాలా ప్రమాదమని న్యూయార్క్‌ మెడికల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ క్రెయిగ్‌ స్పెన్సర్‌ అన్నారు. మరోవైపు, కొలంబియా యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌‌కు చెందిన నిపుణుడు దీనిపై స్పందిస్తూ.. లాలాజలంలోని కరోనా వైరస్‌ను చంపేందుకు.. ట్రంప్ చెప్పినట్లుగా బ్లీచ్‌ లేదా ఐసోప్రొపైల్డ్ ఆల్కాహాల్‌ను దయచేసి తాగకండి. ఆ ప్రయత్నం చాలా ప్రమాదకరం.’’ అని అన్నారు. చాలామంది అమెరికాకు చెందిన వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here