అవసరం తీరగానే.. అమెరికా తీరు మారుతుంది.. శ్వేతసౌధమే నిదర్శనం!

భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడి భవనం ట్విట్టర్లో అన్‌ఫాలో చేసింది. మోదీతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, పీఎంవో ఆఫీసు, ఇతర భారత ట్విట్టర్ ఖాతాలను కూడా అన్‌ఫాలో చేసింది. ఇంతకు ముందు వైట్ హౌస్ ట్విట్టర్లో 19 ఖాతాలను అనుసరించగా.. తాజాగా ఆరు ఖాతాలను అన్‌ఫాలో చేసింది. ఇవన్నీ భారత్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. ఇప్పుడు శ్వేత సౌధం కేవలం అమెరికా నేతలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతోంది.

ఏప్రిల్ 10న వైట్ హౌస్ పీఎం మోదీతోపాటు రాష్ట్రపతి, పీఎంవో ఆఫీస్, భారత్‌లోని అమెరికా ఎంబసీకి చెందిన ట్విట్టర్ ఖాతాను, వాషింగ్టన్‌లోని భారత ఎంబసీని, భారత్‌లో అమెరికా రాయబారి ఖాతాను ట్విట్టర్లో శ్వేత సౌధం అనుసరించింది. దీంతో 22 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వైట్ హౌస్.. ట్రంప్ మినహా ట్విట్టర్లో ఫాలో అవుతున్న ఏకైక దేశాధినేతగా మోదీ నిలిచారు. కానీ మూడు వారాలు కూడా గడవక ముందే వైట్ హౌస్ మోదీని అనుసరించడం మానేసింది.

అమెరికాలో కరోనా విజృంభించడంతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని ఎగుమతి చేయాలని ఏప్రిల్ తొలి వారంలో ప్రధాని మోదీని ట్రంప్ కోరారు. కానీ భారత్ నో చెప్పడంతో ట్రంప్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. చివరకు భారత్ పాక్షికంగా ఆంక్షలు ఎత్తివేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అమెరికా పంపించడంతో ప్రధాని మోదీకి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here