వడియాల కోసం వెళ్లి బాలుడు మృతి.. తూర్పు గోదావరిలో దుర్ఘటన

వడియాల కోసం వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తూ మరణించిన దుర్ఘటన తూర్పు గోదావరిలో జరిగింది. విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. జిల్లాలోని కొత్తపల్లి మండలం కొండెవరానికి చెండిన బాలుడు బొండాడ సతీష్(9) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు.

ఇంటి డాబాపై బాలుడి మేనత్త వడియాలు పెట్టింది. అవి తీసుకొచ్చేందుకు వెళ్లిన బాలుడు డాబాపై ఉన్న వడియాలన్నింటినీ ఒకచోటకు చేర్చాడు. అనంతరం తన మేనత్తను పిలిచేందుకు పిట్టగోడ వద్దకు వెళ్లి ముందుకు వంగి ఆమెను పిలిచాడు. ఈ క్రమంలో డాబా పక్క నుంచి వెళ్తున్న విద్యుత్ హై టెన్షన్ వైర్లకు ప్రమాదవశాత్తూ తగలడంతో షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు.

Also Read:

బాలుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మరణించాడని.. హై టెన్షన్ వైర్లు ఇళ్ల పై నుంచి వెళ్తున్నా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నివాస భవనాలకు సమీపంలో ఉన్న హైటెన్షన్ తీగల లైన్ మార్చేందుకు గతంలోనే నిధులు మంజూరయ్యాయని.. కానీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే బాలుడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here