అమర్‌నాథ్ యాత్ర‌పై నిర్ణయం అప్పుడే..!

ప్ర‌తిష్టాత్మ‌క అమ‌ర్‌నాథ్ యాత్ర ఎప్పుడు జ‌ర‌పాల‌నేదానిపై జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైరస్‌పై వీలైనన్ని రివ్యూలు చేసి, యాత్ర‌పై స్ప‌ష్ట‌త‌కొస్తామ‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గిరీష్ చంద్ర‌ ముర్ము తెలిపారు. నిజానికి ఈ యాత్ర జూన్ 23న జ‌ర‌గాల్సి ఉంది. 42 రోజుల‌పాటు జ‌రిగే ఈ యాత్ర‌లో భాగంగా 3,880 మీటర్ల ఎత్తును ఉన్న గుహ‌ను చేరుకుని యాత్రికులు శివ‌లింగాన్ని ద‌ర్శించుకుంటారు.

Must Read:

యాత్ర‌ను జ‌రిపేందుకు అందుబాటులో ఉన్న ప్ర‌త్యమ్నాయాల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. కాల‌నుగుణంగా జ‌రిగే రివ్యూల ద్వారా మాత్రమే ఒక నిర్ణ‌యానికి వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా రాజ‌భ‌వ‌న్‌లోని అమ‌ర్‌నాథ్‌, బుధ అమ‌ర్‌నాథ్ యాత్రి నివాస్ స‌భ్యుల‌తో తాజాగా ముర్ము స‌మావేశ‌మ‌య్యారు. మ‌రోవైపు అమ‌ర్‌నాథ్ యాత్ర‌ తర్వాత జ‌మ్మూలోని పూంచ్ జిల్లాలో ఆగ‌స్టులో ప‌దిరోజుల‌పాటు బుధ అమ‌ర్‌నాథ్ యాత్ర కూడా జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here