అదిరిపోయే పోలీస్ చేజ్‌.. క్రిమినల్ తిరగబడడంతో కాల్చిపారేసిన ఖాకీలు

మర్డర్ కేసు విచారణకు వెళ్లిన పోలీసులను చూసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఖాకీలు అతడిని ఛేజ్ చేశారు. ఇంతలో ఓ కానిస్టేబుల్ నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో క్రిమినల్ తిరగబడ్డాడు. అతను తిరిగి పోలీస్‌పైనే దాడి చేయడంతో ఖాకీలు తుపాకీతో కాల్చిపడేశారు. ఈ ఘటన రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభు అనే వ్యక్తిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బాగల్‌గుంటే పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన అర్జున్ సింగ్, ప్రభు మధ్య ఆన్‌లైన్ గేమ్ విషయంలో వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య గొడవ తీవ్రమవడంతో ఆగ్రహం చెందిన ప్రభు కత్తితో అర్జున్ సింగ్‌ని పొడిచేశాడు. వెంటనే స్థానికులు స్పందించి కత్తిపోట్లకు గురైన అర్జున్‌ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Also Read:

ఆ విషయం తెలుసుకున్న అర్జున్ సింగ్ సోదరుడు కరణ్ సింగ్ తన స్నేహితులతో కలసి అక్కడికి చేరుకుని ప్రభుతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రభు కత్తితో కరణ్ సింగ్‌ని కూడా పొడిచేశాడు. పొత్తి కడుపులో, ఛాతిపై కత్తితో పొడవడంతో కరణ్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రభు ఆచార్య ఇన్‌స్టిట్యూట్ సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగారు.

ఆచార్య ఇన్‌స్టిట్యూల్ పరిధిలోని నిర్మాణంలో భవనాల్లో ప్రభు ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులను చూసిన ప్రభు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ పట్టుకునేందుకు యత్నించగా ప్రభు తిరగబడ్డాడు. కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో ప్రభుని పోలీసులు కాల్చిపడేశారు. అతని కుడికాలుపై తుపాకీతో కాల్చడంతో కిందపడిపోయిన ప్రభుని అదుపులోకి తీసుకున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here