ఈ వార్త చదివితే మీ ఒళ్ళు పులకరిస్తుంది .. ప్రతీ ఇండియన్ ఇది షేర్ చెయ్యండి

ఉత్తరఖాండ్ నిండా వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఆ రాష్ట్రం మొత్తం ఎటు చూసినా జలమే అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే నిన్న బక్రీద్ సందర్భంగా వేలాది ముస్లిం లు గుంపులుగా కలిసొచ్చి ఎప్పటి లాగానే ప్రార్ధనలు చేసుకోవడానికి సిద్దం అయ్యారు. కానీ అనుకోకుండా ఆ పరిస్థితి లో విపరీతమైన వర్షం పడ్డం గాంధీ మైదానం తో పాటు దగ్గరలో ఉన్న మసీదులు కూడా పూర్తిగా వరదనీరు చేరడం తో వారు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఎక్కడ  ప్రార్థనలకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో వారంతా నిరాశలో కూరుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న దగ్గర లోని సిక్కు మత పెద్దలు, సిక్కు వ్యక్తులూ వారిని తమ గురుద్వారా లోకి ఆహ్వానించి మంచి తనం చాటుకున్నారు. తమ గురుద్వారా లో ఈద్ ప్రార్ధనలు చేసుకోవచ్చు అంటూ తేల్చి చెప్పారు వారు. దాంతో వెంటనే వేలాది ముస్లిం లు బ్యాచ్ లుగా విడిపోయి కొంత సమయం కొందరు అలా ప్రార్ధనలు చేసుకున్నారు. దాదాపు వెయ్యి మంది మొహాలీ లో ఇలా ప్రాధనలు చేసుకున్నారు. ఈ సంఘటన తరవాత ముస్లిం లు మాట్లాడుతూ సిక్కులు చూపించిన అభిమానానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్నారు. ఈ దేశం లో ఇంకా మానవత్వం ఉంది అని ఈ రకంగా ప్రూవ్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here