ముద్రగడ విషయం లో చంద్రబాబు కే పవన్ పూర్తి సపోర్ట్ ?

ముద్రగడ విషయం లో చంద్రబాబు కే పవన్ పూర్తి సపోర్ట్ ?

గత ఎన్నికల కీ  రానున్న ఎన్నికల కీ మెయిన్ గా మారని అంశం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కాపుల రిజర్వేషన్ అంశం అనే చెప్పాలి. వచ్చే ఎన్నికల కి ఇది అసలు సమస్యగా మారకుండా చూసేలా చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వ్యూహాలు రచిస్తోంది. ఒకవేళ రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే దానికి ప్రధాన కారణం ఈ కాపుల రిజర్వేషన్ మాత్రమే అవుతుంది తప్ప ఇంకేదీ కాదు. మరొక పక్క ముద్రగడ పద్మనాభం ఈ విషయం లో చాలా సీరియస్ గా ఉంటూ ఉద్యమం ముందుకు సాగిస్తున్నారు. దీని మీద రీసెంట్ గా స్పందించిన పవన్ కళ్యాణ్ ఆ మధ్యన చంద్రబాబు ని కలిసినప్పుడు కాపుల ఉద్యమం విషయం లో తన వైఖరి ప్రభుత్వం చేసేది కరక్ట్ అన్నట్టుగా మాట్లాడారు. పాదయాత్రలు , ఉద్యమాల వలన మాత్రమే సమస్యలు పరిష్కారమ వుతాయా అన్నట్టు కామెంట్ చేసారు అని పవన్ మీద తాజాగా మీడియా లో వార్త వచ్చింది.తన జనాసేన కుర్రాళ్ళతో మాట్లాడుతున్న రీసెంట్ టైం లో ఈ మాట పవన్ నోట్లోంచి వచ్చింది.   ఇది ముద్రగడ కి వ్యతిరేకంగా పవన్ చేసారు అనేది చెప్పుకుంటున్న టాక్. కానీ ముద్రగడ వ్యక్తిగత హక్కులని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటోంది అనేది పవన్ అసలు ప్రస్తావించకపోవడం ఇబ్బందికర విషయం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here