మా వాడు వస్తున్నాడు .. నేనూ ఆసక్తిగా చూస్తున్నా – ఓపెన్ అయిన బాలయ్య

ఇవాళ నందమూరి వారసుడు, నందమూరి మోక్షజ్ఞ పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నందమూర్ అభిమానులు ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో గ్రాండ్ గా పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది మోక్షజ్ఞ పేరు , సినిమాల్లోకి రాకుండానే మోక్షజ్ఞ నామం ఫాన్స్ నోట్లో నానుతోంది బాగా. బాలయ్య కొత్త సినిమా పైసా వసూల్ విడుదల సందర్భంగా , మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా బాలయ్య 101 మంది మహిళలకి చీరలు పంచి పెట్టారు. హిందూపురం లోని తన అభిమాన సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో పాల్గొన్న బాలయ్య ఫుల్ యాక్టివ్ గా కనపడ్డారు. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ లాంచింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వారందరి కోరికా త్వరలోనే నెరవేరుతుందని చెప్పారు. ఫాన్స్ లాగానే మోక్షజ్ఞ తెరమీద ఎలా చేస్తాడు అనే విషయం లో తాను కూడా ఇంటరెస్టింగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here