విజయ్ దేవరకొండ తో నటించను అని చెప్పేసిన లావణ్య త్రిపాఠి

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఒకే ఒక్క హీరో వైపు ఆసక్తి తో చూస్తోంది  . విజయ్ దేవరకొండ .. ఈ పేరు చెప్తే చాలు నిర్మాతలు ఎన్ని కోట్లైనా పెట్టడానికి సిద్దం గా ఉన్నారు. అర్జున్ రెడ్డి అనే సినిమాతో తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ తనకంటూ సూపర్ స్టైల్ ఏర్పరచుకున్నాడు. తక్కువ సినిమాల లో ఎక్కువ ఫేం తెచ్చుకున్న విజయ్ దేవరకొండ రాబోయే తెలుగు పరిశ్రమ కి వారసుడు గా చెబుతున్నారు విశ్లేషకులు. అలాంటి హీరో తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఒద్దు అంటుందా ? కానీ లావణ్య త్రిపాఠి మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తించింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ని తీసుకున్నారు అయితే ఆమె రీజన్ చెప్పకుండా ఈ సినిమా నుంచి తప్పుకుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here