బాలయ్య నాకు షూటింగ్ మొదటి రోజే వార్నింగ్ ఇచ్చారు – పూరీ

నెంబర్ 1 యారీ అంటూ రానా నడుపుతున్న టాక్ షో సూపర్ డూపర్ హిట్ గా నడుస్తోంది. జెమినీ టీవీ కి విపరీతమైన పాజిటివ్ టీఆర్పీ ని తెచ్చిపెడుతున్న ఈ టాక్ షో లో తాజాగా తమ కొత్త సినిమా పైసా వసూల్ ప్రమోషన్ ల కోసం టీం బాలయ్య – పూరీ ఈ షో లో కనపడ్డారు. బాలయ్య తో ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడుతూ బాలయ్య తనకి సినిమా స్టార్టింగ్ లోనే వార్నింగ్ ఇచ్చారు అనీ ” సర్ సర్ అని పిలిచే వాడిని. ఆయన ఒకరోజు సీరియస్ అయ్యారు, గట్టి వార్నింగ్ ఇచ్చారు .. నన్ను బాలా అని పిలు లేదంటే అసలు సినిమా చెయ్యను అనేసారు ” అప్పటి నుంచి బాల అలవాటు అయిపొయింది. బాలయ్య కూడా పూరీ సినిమా అనగానే అందరూ చెయ్యద్దు అన్నారు అనీ కానీ అతని కథ మీద నమ్మకం తో చేసాను అనీ చెప్పుకొచ్చారు. ఈ ప్రోగ్రాం చాలా చక్కగా సరదాగా సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here