ఫేస్ బుక్ కు వీలునామా రాయాల్సిందే

ఫేస్ బుక్ యూజ‌ర్ ఎవ‌రైనా చ‌నిపోతే ఆ అకౌంట్ పై వీలునామా ఉంటేనే సంబంధిత వ్య‌క్తులు ఎవ‌రైనా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని  ఫేస్ బుక్ వెల్ల‌డించింది.
2012లో రైలు ప్ర‌మాదంలో 15ఏళ్ల కూతుర్ని పోగొట్టుకున్న త‌ల్లిదండ్రులు..ఆ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని , త‌గిన ఆధారాలు కావాలంటే ఆమె ఫేస్ బుకు ఓపెన్ చేస్తే అన్ని వివ‌రాలు భ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని జ్యూడిషియ‌ల్ కోర్టుమెట్లెక్కారు. అయితే టీనేజ‌ర్ల ప్రైవసీ విష‌యంలో తాము ఏం చేయ‌లేమ‌ని ఫేస్ బుక్ యాజ‌మాన్యం తేల్చి చెప్పింది.
కోర్టుకూడా ఫేస్ బుక్ కు అనుకూలంగా తీర్పించింది. అయితే చ‌నిపోయిన వారి అకౌంట్ల‌ను  ఎవ‌రు ఉప‌యోగించాలి అనే దానిపై జ‌ర్మ‌నీకి చెందిన హైకోర్టు సంచ‌ల‌న తీర్పించింది. సోష‌ల్ మీడియా ఉప‌యోగం విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంతో ఫేస్ బుక్ క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేసింది. చ‌నిపోయిన వారి అకౌంట్ బ్లాక్ అవ్వ‌డ‌మే త‌ప్ప‌..దాన్ని మిగిలిన వారు ఉప‌యోగించ‌కూడ‌దు అనే నిబంధ‌న అమ‌ల్లో ఉంది. అయితే దీనిపై నెటిజన్లు త‌మ వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు, ప‌ర్స‌న‌ల్ విష‌యాలు ఎన్నోపంచుకుంటున్నారు.
వాటిల్లో జోక్యం చేసుకోవ‌డం త‌ల్లిదండ్రుల‌కు కూడా అర్హ‌త లేదు. ఒక‌వేళ సోష‌ల్ మీడియా అకౌంట్ యూజర్లు చనిపోతే? ఇక ఆ అకౌంట్ ‌ను ఇత‌రులు ఉప‌యోగించ‌వ‌చ్చా? ఆ యూజ‌ర్‌ అంత‌కు ముందు వీలునామా రాసి ఉంచితే ఉప‌యోగించవ‌చ్చు. అలా వీలునామా ఉంటేనే బ‌ద్ర‌త ఎక్కువ‌. వీలునామా న‌మ్మ‌క‌మైన వ్య‌క్తుల గురించి వివ‌రిస్తారు కాబ‌ట్టి ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌వు అనే న‌మ్మ‌కం. కాబ‌ట్టి ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే త‌ప్ప‌నిసరిగా వీలునామా రాయాల‌ని ఫేస్ బుక్ నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here