చాలా మందికి తెలియని .. దాసరి నారాయణరావు ప్రేమకథ .. ఎక్స్ క్లూజివ్

దాసరి నారాయణరావు , ఆయన భార్య దాసరి పద్మ లది ప్రేమ వివాహం అని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆయన ప్రేమ కథ చాలా కొద్ది మందికే తెలుసు అని చెప్పాలి. ఆ ప్రేమ కథ హైదరాబాద్ పాత బస్తీ లో మొదలైంది అని చాలా తక్కువ మందికి తెలుసు. దాసరి నాటకాలు వేస్తూ చిన్న ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తన చెల్లికి గాజులు కొనడం కోసం సుల్తాన్ బజార్ కి వెళ్లారట. ఆ టైం లో ఆయనకి తన చెల్లి అంటే చాలా ప్రాణం అంటూ చెప్పేవారు. ఏ సినిమా తీసినా ఆ రెవెన్యూ లో ఆమెకి ఏదోటి కొనడం అలవాటు దాసరి కి.

సుల్తాన్ బజార్ లో గాజుల దుకాణం ఓనర్ ఏ సైజ్ గాజులు కావాలి? అని యజమాని అడుగగా, పక్కనే ఉన్న ఓ అమ్మాయిని చూపించి ఆ సైజులోవి కావాలి అని అడిగారట. అదే టైం లో ఆ అమ్మాయి కీ దాసరి కీ మాటలు కలిసాయి. మీరు నాటకాల  దాసరి కదా అంటూ ఆమె మాటలు కలపడం తన కొత్త నాటకం కోసం ఆమెని ఆహ్వానించడం ఆ పరిచయం ప్రేమగా మారింది.  ఆ అమ్మాయే పద్మ. వారి పరిచయం ప్రేమగా మారగా, పరిణయంతో ఆ జంట ఒకటై దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రయాణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here