బుల్లితెర‌కు ర‌వి, శ్రీముఖి గుడ్ బై

యాంక‌ర్స్  ర‌వి, శ్రీముఖి బుల్లితెర‌కు గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప‌టాస్ షోలో వీరిద్ద‌రు చేసిన హ‌డావిడి అంతా ఇంతాకాదు. డ‌బుల్ మీనింగ్ డైలాగులు, బీగ్రేడే త‌ర‌హా స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని చికాకుపెట్టించ‌డంతో సెన్సార్ బోర్డు స‌భ్యులు హెచ్చ ఆర్సీని ఆశ్ర‌యించారు. బూతుకామెడితో చిన్నారుల జీవితాల్ని నాశ‌నం చేస్తున్నారని..త‌క్ష‌ణ మే వీరిద్ద‌రు ఆయా షోల‌నుంచి వైదొల‌గాల‌ని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. దీనిపై స్పందించిన  హెచ్‌ఆర్సీ ప‌టాస్ టీం యాజ‌మాన్యానికి లేఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

షోలో చేస్తున్న ఓవ‌ర్ యాక్ష‌న్ పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని తెలిపింది. ఈనేప‌థ్యంలో పటాస్ టీం యాజ‌మాన్యం ర‌వి, శ్రీముఖిల‌కు షోల‌కు రావొద్ద‌ని తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం. రికార్డు అయిన షోల వ‌ర‌కు అందుబాటులో ఉండే వీరిద్ద‌రూ త్వ‌ర‌లో ప‌టాస్ షో నుంచి నిష్క్ర‌మించ‌నున్నారు. వీరి స్థానంలో కొత్త‌వారిని ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డారు. ఈ దెబ్బ‌తో ర‌వి, శ్రీముఖి యాంక‌ర్ల షో అంటే ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ య‌జ‌మానులు భ‌య‌ప‌డిపోతున్నార‌ట‌. వారిద్ద‌రు త‌మ ఛాన‌ల్లో షో చేస్తే తమ‌కి కూడా చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని ..అందుకే వారిద్ద‌రిని షోల‌కు తీసుకోకుండా ఉంటే మంచిద‌నే అభిప్రాయంలో ఉన్నార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here