డయాబెటిస్‌ వ్యాధితో అంధత్వం

నేటి ఉరుకుల పరుగులు జీవితంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు తరుచుగా డయాబెటిస్‌ వ్యాధికి గురవుతున్నారు. తెలియని ఒత్తిడి, వంశపారంపర్యం, కాలుష్యం వంటి వాటివల్ల పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆధునిక జీవితంలోని వేగాన్ని అందుకునేందుకు వ్యక్తులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్ల నుంచి జీవనశైలి వరకూ ప్రభావితం అవుతున్నది. డయాబెటిస్‌ వ్యాధి లక్షణాలు గుర్తించి, దాని నివారణకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.
డయాబెటిస్‌(మధుమేహ వ్యాధి)
మన శరీరం కోట్లకొద్దీ కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణానికి శక్తినిచ్చే ఇంధనం ‘గ్లూకోజ్‌’. ఇది రక్తంలో ఉండి, రక్తం ద్వారా అన్ని కణాలకూ చేరుతుంది. ఈ గ్లూకోజ్‌ రక్తంలో తగిన మోతాదులు ఉంటే అన్ని శరీర భాగాలనూ ఆరో గ్య వంతంగా ఉంచుతుంది. ఇదే గనుక మోతాదు మించితే విషంగా మారి అన్ని శరీర భాగాలనూ హరించి వస్తుంది. రక్తంలో గ్లూకోస్‌ను లెవల్స్‌ మోతాదు మించి ఉండటమే డయాబెటిస్‌.
ఘగర్‌ మోతాదును నియంత్రించే హోర్మోన్‌ ఇన్సులిన్‌. ఈ ఇన్సులిన్‌ తక్కువ ఉండడం వల్ల, లేదా దీని పనితనం తక్కువ కావడం వల్ల రక్తంలో షుగర్‌ లెవల్‌ మోతాదుకు మించి పెరిగిపోతుందది. దీనినే డయాబెటిస్‌, మధుమేహం, ఘగర్‌ వ్యాధి అంటారు. ఈ వ్యాధి వల్ల శరీరంలోని అన్ని భాగాలకు ముప్పే. దీని వల్ల చెడి పోవు భాగాలు ముఖ్యంగా కళ్లు, కిడ్నీ, పాదం.
డయాబెటిక్‌ రెటినోపతి…
మన కళ్ళు సజీవ కెమెరాల్లాంటివి. కెమెరాలాగ ఇవి నిరంతరం, మనం చూస్తున్న దృశ్యాలను ఫోటోలు తీసి మెదడుకు పంపిస్తూ ఉంటాయి. కెమెరాలో ఫిల్మ్‌ ఉన్నట్లు మన కంటిలో కూడా ఫిల్మ్‌ ఉంటుంది. ఇదే రెటినా. ఇది ఉల్లి పోరలా పల్చ గా ఉండి కంటి లోపల వెనుకభాగంలో చాపలా విస్తరించి ఉంటుంది. రెటినా కంటిలో అతిముఖ్య భాగం.
రెటినాకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలను ‘రెటివల్‌ బ్లడ్‌ వెసెల్స్‌’ అంటారు. ఇవి రెటినాలో శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంటాయి.
ఘగర్‌ వ్యాధి ఈ రెటినా రక్త నాళాలను బలహీనపరిచి వాటికి తూట్లు పడేలా చేస్తుంది. అందువల్ల ఈ నాళాలు లీక్‌ అవడం మొదలవుతుంది. రెటినాలో ఈ లీకేజీ అంచెలంచెలుగా పెరిగి ఆఖరి స్టేజీలలో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. ఘగర్‌ వల్ల వచ్చే ఈ ంటి నాళాల జబ్బునే డయాబెటిక్‌ రెటినోపతి అంటారు. రక్తంలో ఉన్న నీరు లేదా క్రొవ్వు పదార్దాలు లీక్‌ అవ్వచ్చు లేదా రక్తమే లీక్‌ అవ్వచ్చు.
రక్తం లీకేజీలను ‘రెటినల్‌ హెమరేజెస్‌’ అంటారు. నీటి లీకేజీని ఎడిమా అని, క్రొ వ్వు పదార్దాల లీకేజీని ‘ఎక్యుడేట్స్‌’ అని అంటారు. ఈ వ్యాధి స్టేజీలుగా పెరిగి ఆఖరి దశలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here