ట్రైలర్ టాక్ – కేశవ .. కుమ్మేసాడు

స్వామీ రారా సినిమా తో తన కెరీర్ ని అమాంతం కొత్త పంథా లో లాగేసిన హీరో నిఖిల్ సిద్దార్థ్ సక్సెస్ కంటే దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అని తెలుసుకుని నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఒక్కొక్క సినిమాకీ నిఖిల్ సినిమాలు అంటే జనం లో ఆసక్తి పెరిగేలా చేస్తున్న నిఖిల్ మధ్యలో శంకరాభరణం తో ఇబ్బంది పడ్డాడు. స్వామి రారా డైరెక్టర్ తో ఇప్పుడు కేశవ సినిమా చేస్తున్న నిఖిల్ అతని కెరీర్ లోనే ఎక్కువ అంచనాలతో దీన్ని విడుదల చేస్తున్నాడు. కాసేపటి క్రితం విడుదల అయిన ట్రైలర్ సూపర్ డూపర్ గా ఉంది.

కెమెరా వర్క్ దగ్గర నుంచీ డైలాగ్స్ వరకూ ట్రైలర్ కిరాక్ అనిపించేలా ఉంది. కార్తికేయ సినిమా టైపు లో ఏదో కొత్త తరహాలో మనోడు ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పచ్చు. సమ్మర్ సీజన్లో.. అది కూడా మే నెలలో పోటీయే లేకుండా సినిమాను రిలీజ్ చేసుకోగలగడం అంటే చిన్న విషయం కాదు కేశవ ఆ రిస్క్ తీసుకుంటున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here