ఈ విషయం లో తేడా కొడితే వర్మ ఫినిష్

బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడానే లేకుండా వరసగా ప్లాపులతో సతమతం అవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అక్కడ ప్లాప్ అయితే ఇక్కడ ఇక్కడ ప్లాప్ అయితే అక్కడ మకాం మార్చేసే వర్మ కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ కి వచ్చి ఇక వెళ్ళనంటే వెళ్ళను అని కూర్చున్నాడు. రామూ ఎప్పుడు ఏం చేస్తాడో ఏం చెప్తాడో ఆయనకే తెలీదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ముంబై చేరుకున్నాడు తెలుగులో దొంగల ముఠా, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్-2, 365 డేస్ లాంటి నాసిరకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడు వర్మ.

ఇప్పుడు హిందీ లో సర్కార్ 3 ని గట్టిగా నమ్ముకున్న రామ్ గోపాల్ వర్మ ముంబై లో నిలబడాలంటే ఈ సినిమా మీదనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో హైప్ క్రియేటటవ్వలేదు. బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఒకటికి రెండుసార్లు సినిమా వాయిదా పడి.. ఎట్టకేలకు  ‘సర్కార్-3’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here