ఈ చిన్నారి శ్రీదేవి ఎవ‌రో తెలుసా మీకు

ప్రపంచంలో  మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారని నానుడి. అది నిజం అనిపించేలా చేస్తుంది జూనియ‌ర్ శ్రీదేవి. తాను ఏడుస్తున్న  ఆహాభావాలు నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. అల‌నాటి అందాల తార శ్రీదేవి చిన్న‌ప్పుడు ఎలా ఉంటుందో ఈ జూనియ‌ర్ శ్రీదేవిని చూస్తే స‌రిపోతుంది. శ్రీదేవికి కార్బన్‌ కాపీలా ఉండే  ఈ చిన్నారి శ్రీదేవి అందాన్ని వివ‌రిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియోను చూసిన వారందరు శ్రీదేవి అంటూ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే శ్రీదేవి తెరంగ్రేటం స‌మ‌యంలో ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకోక ముందు ఎలా ఉండేదో..ఈ జూనియ‌ర్ శ్రీదేవి అలానే ఉంది. ఈ వీడియోలో ఉన్న చిన్నారి ఎవ‌రు..? శ్రీదేవికి ఈ పాప‌కు సంబంధం ఏమైనా ఉందా..? అని ఆరాతీసే ప‌నిలోఉన్నారు ఔత్సాహికులు. ఇదిలా ఉంటే శ్రీదేవికి చెందిన ఈ జూనియ‌ర్ శ్రీదేవి త‌మిళ‌నాడుకు చెందిన అమ్మాయిగా గుర్తించారు. బాష‌తో సంబంధంలేకుండా అభిమానుల్ని సొంతం చేసుకున్న అతిలోకసుందరి శ్రీదేవిలా వుంది.  కళ్ళు, ముక్కు, టోటల్‌గా శ్రీదేవి మాదిరిగా వున్న ఈ చిన్నారిని వీడియో తీసిన త‌ల్లిదండ్రులు వీడియోతీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. పాప భయంతో బిక్క మొహం పెట్టిందిగానీ, నవ్వితే ఆ చిన్నారి హావభావాలు మొత్తం శ్రీదేవి చిన్ననాడు ఇలాగే ఉందేమో అనిపించేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here