దాస‌రి మ‌ర‌ణాన్ని అవ‌మానించిన శ్రీదేవి

దాస‌రినారాయ‌ణ రావు మ‌ర‌ణాన్ని శ్రీదేవి అవ‌మానించింద‌ని నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.  దర్శ‌క‌ర‌త్న దాస‌రినారాయ‌ణ రావు మ‌ర‌ణించిన తీరు అంద‌ర్ని క‌లిచి వేసింది. దాస‌రి చేసిన సేవ‌ల్ని స్మ‌రిస్తూ ప్ర‌తీ ఒక్క‌రు నివాళులు అర్పించారు. మ‌రికొంత‌మంది హీరోలో దాస‌రి త‌మ‌కు చేసిన స‌హ‌యాన్ని,  ఔదార్యాన్ని స్మ‌రిస్తూ క‌న్నిటీ ప‌ర్యంత‌మయ్యారు. కానీ శ్రీదేవికి ఇంత కీర్తిప్ర‌తిష్ట‌లు తెచ్చిన దాస‌రిని స్మ‌రించ‌డం కాదు స‌రికాదా..క‌నీసం సంతాపం తెల‌ప‌లేదని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్దార్ పాపారాయుడు, బొబ్బులిపులి, ప్రేమాభిషేకం సినిమాలతో అంద‌లం ఎక్కిన శ్రీదేవిని తెలుగు ప్ర‌జ‌లు త‌మ ఆరాధ్య దేవ‌త‌గా భావించారు. శ్రీదేవి ఇంత‌లా ఎద‌గ‌డానికి ఎంత‌గానో దోహదం చేసిన తెలుగు వారు ఆరాదించారు. అయితే శ్రీదేవి దాస‌రి విష‌యంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండ‌లేద‌నే విష‌యాన్ని అర్ధం చేసుకోలేద‌నే చెప్పుకోవ‌చ్చు. త‌న ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన దాస‌రి నారాయ‌ణ రావు మ‌ర‌ణిస్తే క‌నీసం నివాళులు అర్పించ‌లేదు. అదే  రోజు శ్రీదేవి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

త‌న త‌దుప‌రి చిత్రం మామ్ కోసం ఎన్నో ట్విట్లు పెట్టింది. నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు తీరిగ్గా స‌మాదానం చెప్పిన శ్రీదేవి దాస‌రిని అవ‌మానించే విధంగా వ్య‌హ‌రిస్తూ క‌నీసం నివాళులు అర్పించ‌లేద‌ని నెటిజ‌న్లు శ్రీదేవిని తిట్టిపోస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here