నారా దేవాన్ష్ ను కూడా వాడేస్తున్నారే

మూడేళ్ల దేవాన్ష‌న్ ను కూడా త‌మ వ్యాపార‌భివృద్ధికోసం వాడుకుంటున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం హెరిటేజ్ పాల ఉత్ప‌త్తులపై త‌మిళ‌నాడు మంత్రి రాజేంద్ర ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. హెరిటేజ్ పాలు క‌ల్తీ  అవుతున్నాయ‌ని, ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు పాల‌లో ర‌సాయ‌నాల‌ను క‌లుపుతున్నారంటూ మండిప‌డ్డారు. అయితే దీనిపై స్పందించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రహ్మణి త‌న మామ చంద్ర‌బాబు పాద‌యాత్ర‌లో హెరిటేజ్ పాలు సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకున్నార‌ని..త‌న మూడేళ్ల కొడుకు నారా దేవాన్ష్ హెరిటేజ్ పాలు తాగే పెరుగుతున్నాడ‌ని చెప్పారు.

ఈ కామెంట్స్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. త‌మ వ్యాపారాభివృద్ధి కోసం నారా దేవాన్ష్ పేరును ప‌బ్లిసిటీ చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని అంటున్నారు. దేవాన్ష్ అక్ష‌రాభ్యాసంలో సాంప్ర‌దాయాన్ని ప‌క్క‌న‌పెట్టి అ,ఆల‌కు కొత్త అర్ధాన్ని చెప్ప‌డంలాంటివి కామ‌న్ గా ఉన్నా….చీఫ్ ప‌బ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతున్నార‌ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి. హైద‌రాబాద్ ను ప్ర‌పంచ ప‌టంలో నిలిపాం, తాను ఇంగ్లీష్ నేర్పించ‌బ‌ట్టే తెలుగువాళ్లు అమెరికా పోతున్నార‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని గుస‌గుస‌లాడుతున్నారు.

అంతేకాదు రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పాటుప‌డాల్సి ప్ర‌భుత్వం మ‌హ‌నాడు, హెరిటేజ్ సంస్థ‌ను అభివృద్ధిలో దూసుకుపోతున్నార‌నే అప‌వాదు ఉంది. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల దృష్ట్యా ఇలాంటి పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నార‌ని.. ఇవ‌న్ని ప‌క్క‌నపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాల‌ని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here