ఇలాగే కొనసాగితే స్పైడర్ అట్టర్ ప్లాప్ !

ఎలా ఉంటుందీ ఎలా ఉంటుందీ అనుకున్న స్పైడర్ లుక్ అద్దరగోట్టేసింది .. మహేష్ ఫాన్స్ సంతోషానికి ఇక అవధి అనేది లేకుండా పోయింది. స్టైలిష్ టీజర్ తో ఫుల్ మీల్స్ పెట్టేసాడు మురుగదాస్. చిన్న టీజర్ తో కాన్సెప్ట్ సినిమా అనీ రోటీన్ హడావిడి ఉండదు అని చూపించాడు మురుగదాస్. సినిమాలో ఏముందో తెలుసుకోవాలి అనే ఉత్సాహం రేపెలా ఉంది టీజర్ అని చెప్పచ్చు. అయితే క్లాస్ వారికి పిచ్చగా ఎక్కేసిన ఈ టీజర్ అసలు మాస్ జనాలకి ఎక్కుతుందా అనే డౌట్ బాగా వినిపిస్తోంది.

టైటిల్ దగ్గర నుంచీ ఒక రేంజ్ క్లాస్ లుక్ ని మైంటైన్ చేస్తున్న స్పైడర్ కి తెలుగులోనే కాదు తమిళం లో కూడా మాస్ జనాల సపోర్ట్ కావాల్సి ఉంది. టైటిల్ లోగో లో కూడా ఇప్పటి వరకూ ఇంగ్లిష్ కనిపిస్తోంది తప్ప తెలుగు ఎక్కడ లేదు. సీడెడ్ ఆంధ్రా లోని బీసీ సెంటర్ లలో స్పైడర్ ఇలాగే కొనసాగితే అట్టర్ ప్లాప్ పక్కా అంటున్నారు విశ్లేషకులు. మల్టీ ప్లేక్స్ జనాలని పక్కన పెట్టి కాస్త అటువైపు కూడా చూడండి మురగదాస్ గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here