పవన్ కళ్యాణ్ ఎవడు?

కత్తి మహేష్ మరొక్కసారి రెచ్చిపోయారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద. ఇటీవల ఓ ఛానల్ డిబేట్ కి వచ్చిన మహేష్ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు….ఎవడండీ పవన్ కళ్యాణ్ జనసేనా అని పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేయని దద్దమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు తోడు దొంగలే అని అన్నారు కత్తి మహేష్. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు లేవనెత్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన జేబులు నింపుకుంటున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కత్తి మహేష్.
ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ త‌రువాత ఏపీకి అన్యాయం జ‌రిగిందంటూ ప్ర‌త్యేక హోదా అంశంపై మ‌ళ్లీ ఉద్య‌మం రూపుదిద్దుకుంటున్న నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు తెర వెనుక ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. హోదా అంశంపై తెర‌పైకి రాగానే జేఎఫ్‌సీ కమిటీ వేస్తున్నామంటూ కాల‌పాయ‌ప‌న చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇదేమీ కొత్త కాదు.. నాడు వైజాగ్ వేదిక‌గా జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక హోదా అంశంపై ప్ర‌త్యేక స‌భ నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరా.. సీఎం చంద్ర‌బాబుతో కుమ్మ‌క్కై ప్ర‌జా ఉద్య‌మాన్ని నీరు గార్చార‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య పార్ట‌న‌ర్ షిప్ ఉంద‌న్న అంశానికి ఈ ఆధారాలు చాల‌న్నారు సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి.
తాజాగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటి కూడా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆ కమిటీ వల్ల ఒరిగిందేమి లేదు అని అన్నారు… పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కోసం కాదు కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం రాజకీయాలలోకి వచ్చారు…..రాబోయే ఎన్నికలలో కూడా టిడిపి పార్టీతో జతకట్టి ఎన్నికల బరిలో దిగుతారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కత్తి మహేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here