కెసిఆర్ కి పాలాభిషేకం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రోళ్లు అంటూ సంబోధిస్తూ ఉద్యమాన్ని తెగ రెచ్చగొట్టేవారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక కెసిఆర్ వైఖరిలో మార్పు లు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆంధ్ర రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు…ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల అక్కడ ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురష్కరించుకొని సైతం పాలాభిషేకాలు ..వేడుకలు ..అన్నదానాలు కూడా చేశారు.తాజాగా మరోసారి విజయవాడ కేంద్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అక్కడి ప్రజలు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో ముదిరాజ్‌ల సంక్షేమం కోసం రూ.5 కోట్లు, ముదిరాజ్‌ల భవనం కోసం ఐదెకరాల స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ ముదిరాజుల సంఘం కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనచేస్తున్నారని కొనియాడారు. అన్నివ‌ర్గాల అభివృద్ధికి కృషిచేస్తున్నార‌ని ముఖ్యంగా బీసీల సంక్షేమానికి పాటుప‌డుతున్నార‌ని ప్ర‌శంసించారు.ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమను తిట్టిన కానీ అటు అటువంటివేమీ మనసులో పెట్టుకోకుండా ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడు అంటూ కెసిఆర్ పై తమ అభిమానం చాటుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here