హీరోయిన్ ఖుష్బూ పై దాడి!

సౌత్ ఇండియా మాజీ హీరోయిన్ ఖుష్బూ గతంలో మహిళల మానంపై చేసిన వ్యాఖ్యలు పెన్ను దుమారాన్ని రేపాయి అని మనకందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఖుష్బూ చేసిన వ్యాఖ్యల పట్ల పై కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ నిమిత్తం తమిళనాడు లోని మేటోర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమెపై కోడిగుడ్ల తో దాడి జరిపారు.
ఈ కేసు విచారణ అనంతరం కేసు ను మార్చ్ 6 కు వాయిదా వేశారు. హీరోయిన్ ఖుష్బూ మిద జరిగిన దాడి ఊహించని విధంగా జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కార్ పై నిరసన కారులు ఒక్కసారిగా కోడిగుడ్లు .. టమోటాలతో దాడి చేసారు. ఈ దాడిలో ఖుష్బూ కి స్వల్ప గాయాలయ్యాయి.ఖుష్బూ తమిళనాడు కాంగ్రెస్ లో కీలక సభ్యురాలిగా పార్టీ వ్యవహారాలు చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ పై జరిగిన దాడికి తమిళనాడు సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here