నాని తో త్రివిక్రమ్ చేసే సినిమా నిర్మాత?

ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సంచలన కరమైన న్యూస్ ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ నాని సినిమా న్యూస్. గత కొద్దిరోజులుగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందనే వార్త ఇండస్ట్రీలో పెనుసంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బయటకొచ్చింది. అదేమిటంటే నానితో త్రివిక్రమ్ చేసే సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తాడని అంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసింది నిర్మాత దానయ్య అని తెలుస్తోంది.
ప్రస్తుతం హీరో నాని కృష్ణార్జున సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా వేసవికి విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడుగా జరుగుతుంది. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలాఖరున జరుగుతుంది. ఈ సందర్భంగా సంవత్సరం చివరాఖరిన త్రివిక్రమ్ నాని  సినిమా మొదలవుతున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here