WHO: అన్నంత పని చేసిన చైనా.. అమెరికాకు షాకిస్తూ..

(డబ్ల్యూహెచ్‌వో)కు 30 మిలియన్ డాలర్ల అదనపు గ్రాంట్‌ను ప్రకటించింది. కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌‌వో విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. ఆ సంస్థలకు కేటాయించే నిధులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌వో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఏటా 50 మిలియన్ డాలర్ల నిధులను ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేటాయిస్తుండగా.. ఈ నిధులను నిలిపేస్తూ ఏప్రిల్ 14న అగ్రరాజ్యం నిర్ణయం తీసుకుంది. దీంతో డబ్ల్యూహెచ్‌వోకు నిధులు పెంచుతామని మరుసటి రోజునే చైనా సంకేతాలు ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు నిర్ణయం తీసుకుంది.

ఇంతకు ముందు డబ్ల్యూహెచ్‌వోకు ఇచ్చిన 20 మిలియన్ డాలర్ల గ్రాంట్‌కు ఇది అదనమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపేస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటన పట్ల చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వోకు తామెప్పుడూ తోడ్పాటు అందిస్తామని చైనా తెలిపింది. అంతర్జాతీయ ప్రజారోగ్యం, కోవిడ్ లాంటి మహమ్మారి కట్టడి విషయంలో డబ్ల్యూహెచ్‌వో కీలక పాత్ర పోషిస్తోందని డ్రాగన్ కితాబిచ్చింది.

అమెరికా స్థానాన్ని భర్తీ చేసేలా ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే సాయాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చైనా సంకేతాలు ఇచ్చింది. కరోనా వైరస్ విషయంలో చైనాతోపాటు డబ్ల్యూహెచ్‌వో పారదర్శకంగా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నాయి. డిసెంబర్లో వుహాన్‌లో కరోనా ప్రారంభం కాగా.. చైనా జవనరి 23న సిటీ లాక్‌డౌన్ ప్రకటించింది. కానీ అప్పటికే 50 లక్షల మంది ప్రజలు చైనీస్ న్యూ ఇయర్ సెలవుల కోసం వుహాన్ విడిచి వెళ్లిపోయారు. దీంతో కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here